AP: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్‌ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ప్రమాద ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్, యజమానిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఏ-1 డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేశారు.