KMR:పెండింగులో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బాలు డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇవాళ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేశారు. విద్యార్థులకు రావలసిన రూ. 8 వేల కోట్ల బకాయిలను వెంటనే మంజూరు చేయాలన్నారు. పేద విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు.