»Script Writer V Vijayendra Prasad Visited Telangana New Secretariat
Telangana Secretariatను సందర్శించిన బాహుబలి కథా రచయిత.. సీఎం కేసీఆర్ పై ప్రశంసలు
ట్యాంక్ బండ్ ఒడ్డున కొలువైన సచివాలయాన్ని ప్రత్యేకంగా విజయేంద్ర ప్రసాద్ తిలకించారు. సచివాలయం లోపల భవనాలు, ఫ్లోరింగ్, గార్డెనింగ్ వంటి అన్నిటిని చూశారు. అతి తక్కువ సమయంలో ఇంత గొప్ప సచివాలయాన్ని నిర్మించడం అద్భుతం
తెలంగాణ కొత్త సచివాలయాన్ని (Telangana New Secretariat) ప్రజలందరూ చూసి అబ్బురపడుతున్నారు. సచివాలయం లోపలకు కూడా అనుమతిస్తే బాగుంటుందని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఈ శ్వేత సౌధాన్ని సందర్శించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సుందర నిర్మాణాన్ని బాహుబలి కథ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ (V Vijayendra Prasad) సందర్శించారు. అనంతరం సీఎం కేసీఆర్ (K Chandrashekhar Rao)పై ప్రశంసల వర్షం కురిపించారు.
హైదరాబాద్ (Hyderabad) ట్యాంక్ బండ్ ఒడ్డున కొలువైన సచివాలయాన్ని (Dr BR Ambedkar Telangana State Secretariat) ప్రత్యేకంగా విజయేంద్ర ప్రసాద్ తిలకించారు. సచివాలయం లోపల భవనాలు, ఫ్లోరింగ్, గార్డెనింగ్ వంటి అన్నిటిని చూశారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ (Joginapally Santosh Kumar)ను కలిశారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ (KCR)ను ఆకాశానికెత్తారు. ‘అతి తక్కువ సమయంలో ఇంత గొప్ప సచివాలయాన్ని నిర్మించడం అద్భుతం. వారసత్వం, సాంస్కృతిక వౌభవం, ఆధునికతల కలబోతకు నిలువెత్తు నిదర్శనంగా ఉంది. సీఎం కేసీఆర్ పట్టుదల, అకుంఠిత దీక్షతో అద్భుతమైన దేవాలయాలను, ప్రజా నిర్మాణాలను నిర్మిస్తున్నారు. మనుషులు రుషులవుతారనే నానుడిని సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు’ అని విజయేంద్ర ప్రసాద్ కొనియాడారు.
‘10 నెలల సమయంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం (125 Feet Ambedkar Statue) నిర్మాణం, అంతకుమించిన ప్రజా సచివాలయం నిర్మించడం గొప్ప విషయం. అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసీఆర్ కే సాధ్యం. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో మెరుపు వేగంతో పరుగులు పెడుతోంది. ఈ అభివృద్ధి పట్ల తెలంగాణ బిడ్డగా చాలా సంతోషంగా ఉంది’ అని కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.