W.G: ఉండి మార్కెట్ యార్డు ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రక రామకృష్ణంరాజు పాల్గొని వివిధ రంగాలకు చెందిన 20 మంది మహిళలను సన్మానించారు. అనంతరం నియోజకవర్గంలోని 1,199 స్వయం సహాయక సంఘాలకు చెందిన 11,990 మంది మహిళలకు బ్యాంకు ద్వారా మంజూరైన 1,25,62,00,000 చెక్కును అందజేశారు.