ELR: వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణ రక్షణ పొందాలని చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ అన్నారు. శనివారం ఉంగుటూరు టోల్గేట్ వద్ద చేబ్రోలు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్లు ధరించినవారికి జరిమానాలను విధించకుండా, వాహన దారులతో హెల్మెట్లను కొనుగోలు చేయించారు. హెల్మెట్ పై వాహనదారులకు అవగాహన కల్పించారు.