BHNG: వంటగ్యాస్ ధరలకు రెక్కలొచ్చాయి. అదును చూసి కేంద్రం రేట్ల బండ బాదింది. కమర్షియల్‌తో పాటు డొమెస్టిక్ గ్యాస్‌పైనా వడ్డించింది. ఏకంగా ఒక్కో డొమెస్టిక్ బుడ్డిపై రూ. 60, కమర్షియల్‌పై రూ.115 పెరిగాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు గ్యాస్ సిలిండర్ గుదిబండగా మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏటా రూ.50 కోట్ల దాకా అదనపు భారం పడనుంది.