SRD: గ్రామ అభివృద్ధికి వార్డు సభ్యులు నిరంతరం కృషి చేయాలని ఎంపీవో లక్ష్మణ్ అన్నారు. మండల కేంద్రమైన కంగ్టి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన వార్డు సభ్యుల శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సభ్యులు కేవలం సంతకాలకే పరిమితం కాకుండా, వార్డులోని సమస్యలను గుర్తించి గ్రామ సభల్లో ప్రస్తావించాలని సూచించారు. గ్రామ ప్రగతిలో భాగస్వాములు కావాలని కోరారు.