Kriti Shetty : నాకు అలాంటి భర్త కావాలి : కృతిశెట్టి
తనకు కాబోయే హస్బెండ్‌కు ఉండాల్సిన లక్షణాలు గురించి కృతిశెట్టి (Kriti Shetty) బయటకు చెప్పింది. బొద్దుగా ఉండే మగవాడు అంటే ఆమెకు ఇష్టమట, బుగ్గలు బుగ్గలు చబ్బీ చబ్బీగా తో పాటు పెద్ద పెద్దగా ఉంటేనే ఇష్టమని తెలిపింది. మంచి మనషు ఉండాలని, ఫైనాన్షియల్, స్టేటస్ గురించి తనకు అవసరం లేదని, మంచి మనుసు ఉంటే చాలని వివరించింది
తనకు కాబోయే భర్త ఎలా ఉండాలనే విషయాలను కన్నడ బ్యూటీ కృతిశెట్టి (Kriti Shetty)వెల్లడించింది. కాబోయే భర్తకు పెద్దగా ఆస్తి ఉండక్కర్లేదట అందంగా కూడా ఎక్కువగా ఉండక్కర్లేదట.మంచి మనసున్నవాడై ఉండాలట.మొహమాటం లేకుండా నిజాయితీగా తన అభిప్రాయాలను వ్యక్తపరచాలట. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వంతో చాలా సింపుల్‌గా ఉండాలట. అంతేకాకుండా కాస్త బొద్దుగా కూడా ఉంటే ఇంకా ఇష్టమని తనకు నచ్చిన క్వాలిటీస్ గురించి చెప్పుకొచ్చింది కృతిశెట్టి. ఉప్పెన(Uppena) సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన కన్నడ బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ బేబమ్మగా(Bebammaga) తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) తో కలసి నటించిన ‘కస్టడీ’ చిత్రం (Custody movie) ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసింది దీంతో కృతిశెట్టి పేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది….బంగార్రాజు సినిమాలో ఆమె నటించి మెప్పించింది. ప్రస్తుతం శర్వానంద్(Sharwanand)తో కృతి నటిస్తుంది. ఇంకా సినిమా పేరు బయటకు రాలేదు. తాజాగా ఆమె తెలుగులో నటించిన సినిమాలు శ్యామ్ సింగరాయ్, ది వారియర్, మాచర్ల నియోజక వర్గం, కస్టడీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడడంతో నెటిజన్లు ఆమెతో ఆడుకుంటున్నారు.