JGL: ధర్మపురి వద్ద గోదావరి నది నీటి ప్రవాహం గురువారం పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టు గేట్లు తెరచి నీరు దిగువ గోదావరి నదిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం ధర్మపురి వద్ద స్నానఘట్టాలు, వైకుంఠధామం ఆనుకుని నీటి ప్రవాహం కొనసాగుతోంది. భక్తులు లోతు ప్రదేశాలకు వెళ్లి స్నానాలు చేయకుండా ఆలయ ఈవో అప్రమత్తం చేశారు.