TG: హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం దగ్గర ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నిరసన చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించారంటూ మండిపడ్డారు. రాష్ట్రపతికి మమతా బెనర్జీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.