తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా మారబోతున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ వామికా గబ్బి నటించనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో టాక్.