సత్యసాయి: తలుపుల మండలం కొండారెడ్డి చెరువుకు సమీపంలో హంద్రీనీవా కాలువకు గండి పడడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆదేశాలపై టీడీపీ నాయకులు గరికపల్లి రామకృష్ణారెడ్డి, ఓబులరెడ్డి, రాజకుమార్ నాయుడు ట్రాక్టర్ల సహాయంతో ఇసుక మూటలు తరలించి గండిని పూడ్చే పనులను వేగంగా చేపట్టారు.