NLG: మొంథా తుఫాన్ నేపథ్యంలో నవంబరు 2వ తేదీ వరకు నార్కట్ పల్లి మండలంలోని వరలక్ష్మీ కాటన్ మిల్లులో.. సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పత్తి కొనుగోలును నిలిపివేస్తున్నట్లు చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి జానయ్య తెలిపారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయానికి రైతులు సహకరించాలని ఆయన కోరారు.