కృష్ణా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోడూరులో పర్యటన నేపథ్యంలో పోలీసులు గురువారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.పవన్ పర్యటన సాఫీగా సాగేందుకు జిల్లా అధికారులు విశేషంగా ఏర్పాట్లు చేశారు. కోడూరు శివారు కృష్ణాపురం వద్ద బారికేడ్లు వేశారు. ఉదయం 10.30 గంటలకు సమయానికి పవన్ అక్కడికి చేరుకోనున్నారు.అనంతరం రైతులతో ముఖా ముఖీ నిర్వహిస్తారు.