పోలవరం ప్రాజెక్టు అథారిటీ 17వ సమావేశం నవంబర్ 7 ఉదయం 11 గంటలకు జరగనుంది. హైదరాబాద్లోని సెంట్రల్ వాటర్ కమిషన్ కాన్ఫరెన్స్ హాల్లో PPA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆధికారి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల నీటిపారుదల శాఖల అధికారులు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు.