WGL: ఈస్ట్ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో చిక్కుకున్న విద్యార్థులు, సిబ్బందిని 4వ బెటాలియన్ TGSP, SDRF బృందం సకాలంలో రక్షించింది. వరద నీరు కాలేజీ ప్రాంగణంలోకి చేరడంతో 375 మంది విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే SDRF సిబ్బంది రక్షణ పరికరాలతో సంఘటనా స్థలానికి చేరుకుని అందరినీ సురక్షిత ప్రదేశాలకు తరలించారు.