VZM: తెర్లాం మండలం గంగన్నపాడులో ఎమ్మెల్యే బేబినాయన పర్యటించారు. చెరువు నీరు గ్రామంలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడంతో ఎమ్మెల్యే పర్యటించి అధికారులకు సూచనలు చేశారు. ముంపునకు గురైన కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ప్రజలు, రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు.