MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలోని కేజీబీవీ (KGBV)లోకి భారీగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లోపలికి వెళ్లలేక ఉపాధ్యాయులు, బయటకు రాలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నీటి ప్రవాహం తగ్గితే తప్ప విద్యార్థులకు పాఠాలు బోధించే పరిస్థితి లేదని బుధవారం ఉపాధ్యాయులు తెలిపారు.