KRNL: ఆలూరు మండలంలోని పలు గ్రామాలలో కురుస్తున్న వర్షాల వల్ల పత్తి రైతులు తీవ్ర నష్టాన్ని చవి చూస్తున్నారు. చేతికందిన పత్తి పంట వర్షం కారణంగా నీటి మునిగి పత్తి విడిపించుకోవటానికి కూడా రాకుండా నేల పాలైపోతోందని కురుకుంద గ్రామ రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. వర్షం కారణంగా వరి, పత్తి, శనగ, మిర్చి తదితర పంటలు నీట మునిగాయని అవేదన వ్యక్తం చేస్తున్నారు.