ASF: కాగజ్ నగర్ మున్సిపాలిటీలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యాచరణలో భాగంగా ఆదివారం వార్డు నం.2, వార్డు నం. 12లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ బి. తిరుపతి స్వయంగా పాల్గొని, చెత్తను తడి-పొడిగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అన్నారు.