SKLM: హిరమండలం గొట్ట బ్యారేజీలో నీటిమట్టం పెరుగుతుందని డీఈ సరస్వతి తెలిపారు. బుధవారం ఉదయం 7 గంటలకు ఉన్న పరిస్థితిని ఆమె వివరించారు. ప్రస్తుతం 26 వేల క్యూసెక్కుల నీరు బ్యారేజ్ లోకి చేరిందన్నారు. నదిలోకి 25 వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నామని, కుడి ఎడమ కాలువలు మూసివేసామని తెలియజేశారు. అయితే ప్రమాదకరమైన పరిస్థితి ఏమీ లేదని పేర్కొన్నారు.