కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మహిళా దినోత్సవం సందర్భంగా HPV వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, DMHO డా. రవీందర్ గౌడ్ ప్రారంభించారు. 14 సంవత్సరాలు వయసు కలిగిన బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలతో వ్యాక్సినేషన్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో DIO డా. రోహిత్ పాల్గొన్నారు.