E.G: రాజానగరం మండలం తోకాడ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు రూ. లక్ష విరాళం ప్రకటించారు. సోమవారం ఆయన ఆలయ కమిటీ సభ్యులకు రూ.లక్ష చెక్కును అందించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధే తమ ధ్యేయమన్నారు.