Sachin Tendulkar: సచిన్ పేరుతో ఫేక్ యాడ్స్..కేసు నమోదు
సోషల్ మీడియా(Social Media)లో గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోటోను వాడుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సైబర్ నేరాలు(Cyber Crimes) రోజురోజుకూ పెరుగుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ నేరాల సంఖ్య తగ్గడం లేదు. టెక్నాలజీని, సోషల్ మీడియా(Social Media)ని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) చేస్తున్న దందా మితిమీరుతోంది. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) పేరును ఉపయోగించి మోసగాళ్లు రెచ్చిపోయారు. అందరూ క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ టెండూల్కర్ ముంబై క్రైం బ్రాంచ్ పోలీసుల(Crime Branch Police)ను ఆశ్రయించాడు.
సోషల్ మీడియా(Social Media)లో గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోటోను వాడుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఫోటోతో పాటుగా వాయిస్ ను కూడా చెడు మార్గాల్లో ఉపయోగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఫేక్ యాడ్స్(Fake ads) చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
సచిన్ (Sachin Tendulkar) ఫిర్యాదుతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 426, 465, 500 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఐపీఎల్లో(IPL 2023) ముంబై ఇండియన్స్ జట్టు(Mumbai Indians)కు సలహాదారుగా సచిన్ టెండూల్కర్ ఉన్నారు. సచిన్ ఫిర్యాదుతో ముంబై పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటామని తెలిపారు.