విజయ్ దళపతి ‘జన నాయగన్’ సెన్సార్ చిక్కులు త్వరలోనే వీడనున్నాయి. ఈ మూవీని మార్చి 9న మధ్యాహ్నం 2 గంటలకు సెన్సార్ రివిజన్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా వీక్షించనున్నారట. వారు ఇచ్చే సర్టిఫికేట్, సూచించే కట్స్ ఆధారంగా విడుదలపై స్పష్టత రానుంది. సెన్సార్ పూర్తికాగానే మేకర్స్ రిలీజ్ డేట్ను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం కోలీవుడ్లో ఈ అప్డేట్ ఆసక్తికరంగా మారింది.