KDP: మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ఒంటిమిట్ట ఎంపీడీవో సుజాత సూచించారు. సోమవారం ఆమె పెన్నపేరూరు గ్రామ సచివాలయాన్ని సందర్శించి గ్రామస్థులతో మాట్లాడారు. ఎలాంటి సమాచారం ఉన్నా ప్రభుత్వ అధికారులకు అందించాలని వారికి సూచించారు.