AKP: కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భాన్ని పురస్కరించుకుని మునగపాక మండలం వాడ్రాపల్లిలో దక్షిణ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ స్వామిని దర్శించుకున్నారు. రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.