HYD: సైబర్ సెక్యూరిటీ కోర్సులకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని HYDలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ. బాలకృష్ణ రెడ్డి అన్నారు. డిగ్రీ స్థాయిలో బీఏ, బీకాం, బీఎస్సీ విద్యార్థులకు ఈ కోర్సు అందిస్తామన్నారు. భవిష్యత్తులో ప్రతి రంగంలో సైబర్ భద్రత కీలక పాత్ర పోషించనుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ కెరీర్ను మలచుకోవాలని పిలుపునిచ్చారు.