HYDకు మంచినీటి సరఫరాకు విద్యుత్ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. జలమండలి ప్రకారం, ప్రధాన జలాశయాల నుంచి నీటిని తరలించి శుద్ధి చేయడానికి సుమారు 130 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ఇది ఆదాయానికి 80% సమానం. దీన్ని తగ్గించేందుకు రూ.400 కోట్ల వ్యయంతో సోలార్ పంప్ హౌస్ ప్లాంట్ ఏర్పాటు కోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది.