ASF: జిల్లాలో మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. పురుషులతో సమానంగా ముందుకు సాగుతూ కీలక బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో కలెక్టర్ హరిత, SP నితిక పంత్ ఉన్నత పదవుల్లో సేవలందిస్తుండగా, రాజకీయ రంగంలో MLA కోవలక్ష్మీ, DCC అధ్యక్షురాలు సుగుణ నాయకత్వం వహిస్తున్నారు. పరిపాలనలోనూ, రాజకీయాల్లోనూ రాణిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.