AP: అఖిల భారత పోలీస్ కమాండో పోటీల్లో నాలుగు పతకాలు సాధించిన ఏపీ పోలీస్ కమాండో జట్టుకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ పతకాలు రావడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని అన్నారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ జట్లు సమష్టిగా ట్రోఫీలు గెలుచుకోవడం రాష్ట్రానికి ఖ్యాతిని తెచ్చిపెట్టాయన్నారు. అలాగే, ట్రోఫీలు గెలుచుకున్న జట్లకు మంత్రి లోకేష్, DGP హరీశ్‌కుమార్ గుప్తా అభినందనలు తెలిపారు.