Acid attack survivor braves challenges, scores 95% in CBSE Class 10 exams
CBSE:ఈ రోజుల్లో అన్నీ బాగున్నవారు కూడా తమకు అదృష్టం లేదని, అది కలిసి రాలేదు, ఇది లేదు అనే వంకలతో జీవితంలో ముందుకు సాగడం లేదు. కొందరు తమలో లోపం ఉన్నా ధైర్యంగా ముందుకు అడుగువేసి అన్నింట్లో సత్తా చాటుతున్నారు. తాజాగా విడుదలైన సీబీఎస్ఈ ఫలితాల్లో (CBSE Results) ఓ విద్యార్థిని సత్తా చాటింది. ఆమె ఓ యాసిడ్ బాధితురాలు కావడం విశేషం.
మూడేళ్ల వయసులో కఫీ అనే చిన్నారిపై ముగ్గురు వ్యక్తులు యాసిడ్ దాడికి (acid attack) పాల్పడ్డారు. అప్పటి నుంచి ఆమె జీవితం మారిపోయింది. సవాళ్లను ఎదుర్కోవడమే పనిగా మారింది. ఆమెకు చికిత్స అందించేందుకు తల్లిదండ్రులు పవన్ (pawan), సమన్ (saman) ఎంతగానో ప్రయత్నించారు. అయినా కూడా కఫీ కంటి చూపును కాపడలేకపోయారు.
ఇప్పుడు ఆ అమ్మాయి సీబీఎస్ఈ పరీక్షల్లో (CBSE Results) 95 శాతం మార్కులు సాధించింది. ఆమె సాధించిన ప్రగతికి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. తనకు భవిష్యత్తులో సివిల్ సర్వెంట్ (civil servant) అవ్వాలని కోరికగా ఉందని ఆమె చెబుతున్నారు. తనపై యాసిడ్ దాడి చేసిన నిందితులు రెండేళ్ల జైలు శిక్ష అనుభవించి తర్వాత స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని అంటోంది. తాను ఆ విషయం గురించి, వారు తనపై చేసిన దాడి గురించి ఆలోచించనని, తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడేలా చేస్తానని చెబుతోంది.
ఆమెకు సరైన విద్యను అందించడానికి కైఫీ కుటుంబం చండీగఢ్‌కు వెళ్లింది. ఆమె తండ్రి హరయాన్ సెక్రటేరియట్లో ప్యూన్ ఉద్యోగం చేస్తున్నారు. ఆమె సాధించిన విజయానికి తల్లిదండ్రులు ఆనందంతో పొంగిపోతున్నారు. ఆమెపై సర్వత్రా ప్రశంసల కురుస్తున్నాయి.