HYD: ఆరోగ్య రంగంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైందని, మహిళలు లేని ఆరోగ్య రంగాన్ని ఊహించుకోలేమని నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిమ్స్ నర్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలు సేవాభావంతో అంకితభావంతో రోగులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా అభినందించారు.