ఖమ్మం నగరంలోని నిజాంపేట్ ప్రాంతంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పవిత్రతను చాటుతూ ముస్లింలకు ఖజూర్ పండును తినిపించి ఇఫ్తార్ విరమింపజేశారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.