TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం మొత్తం 82,838 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 31,006 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.94 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లు నిండగా, సర్వదర్శనం (SSD టోకెన్లు లేకుండా) సుమారు 8 గంటలు సమయం పడుతోంది.