జంతువులకు సంబంధించిన వీడియోలు(Videos) సోషల్ మీడియా(Social Media)లో ఈమధ్య ఎక్కువగా వైరల్(Viral) అవుతున్నాయి. వాటి చేష్టలు కొన్నిసార్లు ఆకట్టుకుంటూ ఉంటే మరికొన్నిసార్లు మాత్రం భయం కలిగిస్తుంటాయి. తాజాగా ఓ తాబేలు(Tortoise) వీడియో నెట్టింట వైరల్(Video Viral) అవుతోంది. సాధారణంగా తాబేళ్లు ప్రశాంతంగా ఉంటాయి. వాటికి కోపం రావడం అతి తక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడొక తాబేలు మాత్రం అందుకు కాస్త భిన్నంగా వ్యవహరించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న తాబేలు వీడియో:
https://twitter.com/i/status/1656109016622288896
ఓ తాబేలు(Tortoise)కు దాహం వేస్తోంది. ఆ సమయంలో ఆ తాబేలుకు నీరు ఇచ్చిన మహిళపై అది దాడికి ప్రయత్నించింది. చాలా దాహంతో ఉన్న ఆ తాబేలును చూసి ఆ మహిళ తన వద్ద ఉన్న వాటర్ బాటిల్ నుంచి నీరు పోసింది. నీరు తాగేందుకు తాబేలు నోరు తెరిచింది. మహిళ కొన్ని సెకండ్ల తర్వాత మరోసారి ఆ తాబేలు(Tortoise)కు నీరు పోసింది.
రెండోసారి నీరు పోస్తుండగా తాబేలు(Tortoise) పెద్దగా నోరు తెరచింది. అయితే ఆ సమయంలో మహిళపై ఆ తాబేలు దాడి చేసేందుకు ముందుకు వచ్చింది. మహిళ ఒక్కసారిగా భయపడి వెనక్కి వచ్చేసింది. ఫెన్సింగ్ అడ్డుగా ఉండటంతో తాబేలు దాడి నుంచి ఆ మహిళ తప్పించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది. ఈ వీడియోకు నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. మహిళకు ఆ తాబేలు ధన్యవాదాలు తెలిపిందని కొందరు కామెంట్ చేస్తుంటే, నీరు చాలంటూ ఆ తాబేలు అలా చెప్పిందని ఇంకొందరు కామెంట్స్ చేశారు. ఇంకొందరేమో మహిళ తాబేలుకు కోపం తెప్పించిందని కామెంట్ చేశారు.