RR: శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో నేడు ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కార వేదికను నిర్వహించనున్నారు. సర్కిల్ పరిధిలోని భవనాలకు సంబంధించిన ట్యాక్స్‌లో తప్పుల సవరణలు, ఎక్కువ నమోదు కావడం సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలి పారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం ఉంటుందన్నారు.