పెద్దపల్లి మండలం పెద్ద కల్వలలో 12 ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై మల్లేష్ తెలిపారు. పోలీసుల వాహన తనిఖీలలో భాగంగా నిన్న సరైన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో ట్రాక్టర్లను స్టేషన్కు తరలించి జరిమానా విధించినట్లు తెలిపారు. లైసెన్స్ కలిగిన వారు మాత్రమే వాహనాలు నడపాలని ఎస్ఐ సూచించారు.