Jagtial Bandh:జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ (Anil) సస్పెన్షన్‌కు గురికాగా.. ఆ ఇష్యూపై వీహెచ్‌పీ (VHP) భజరంగ్ దళ్ స్పందించాయి. బలహీన వర్గానికి చెందిన మహిళ మీద దాడి చేసి.. మహిళ భర్తను సస్పెండ్ చేశారని.. ఇది కక్ష సాధింపు చర్యగా అభివర్ణించాయి. రేపు (శనివారం) జగిత్యాల్ పట్టణం బంద్‌కు పిలుపునిచ్చాయి. అనిల్‌పై (Anil) సస్పెన్షన్ ఎత్తివేయాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. విచారణ జరగకుండానే సస్పెండ్ చేయడం ఏంటీ అని ప్రశ్నించారు. ఇదీ మంచి పద్దతి కాదని అంటున్నారు.
ఈ నెల 9వ తేదీన జగిత్యాల బస్ డిపో వద్ద ఆర్టీసీ బస్సులో ఎస్సై అనిల్ (anil) భార్య వస్తున్నారు. ఆమెకు బాబు ఉండగా.. సీటు ఇవ్వాలని ముస్లిం మహిళలను (muslim ladies) కోరింది. సీటు ఇవ్వాలని కండక్టర్ చెప్పినా వినలేదట. ఇదే అంశంపై గొడవ జరిగింది. జగిత్యాల బస్ స్టేషన్‌కు రావాలని కొందరికీ ఫోన్ చేయడంతో.. తన భర్త అనిల్‌కు ఇదే విషయం చెప్పానని పేర్కొంది. తనను తీసుకెళ్లడానికి డిపో వద్దకు వచ్చాడని.. ఆ సమయంలో గొడవ జరిగిందని వివరించింది. అనిల్ ఎవరిపై దాడి చేయలేదని తెలిపింది.
ఘటనపై విచారించి, నివేదిక తీసుకున్నామని జగిత్యాల ఎస్పీ (sp) వివరించారు. ఎస్సైని ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా డ్యూటీ నుంచి సస్పెండ్ చేశారు. దీనిని వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ తీవ్రంగా పరిగణించాయి. ఏ తప్పు చేయకున్నా.. సస్పెండ్ చేయడం ఏంటీ అని అడిగింది. వెంటనే సస్పెన్షన్ ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తోంది.