కృష్ణా: మచిలీపట్నంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి కొల్లు రవీంద్ర శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్, మూడా, రెవెన్యూ, రూరల్ వాటర్ స్కీమ్, ఆర్ & బీ శాఖలకు చెందిన అధికారులతో మంత్రి సమావేశమై నియోజకవర్గంలో కొనసాగుతున్న రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.