KRNL: బాలికలను ప్రోత్సహించినప్పుడే దేశ అభివృద్ధి జరుగుతుందని జిల్లా ఏఎంసీ మాజీ ఛైర్పర్సన్ శమంతకమణి అన్నారు. శనివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బాక్సింగ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమే పాల్గొని మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ బాలికలను తమకు నచ్చిన రంగంలో ప్రోత్సహించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.