అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చేతుల నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులు అందుకున్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మోహన్, హలిపీర, పార్వతి, వణితలకు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.4లక్షల ఆర్థిక సాయాన్ని ఆయన అందజేశారు.