సత్యసాయి: గుడిబండ పీహెచ్సీలో ఈ నెల 28న బెంగళూరు శంకర్ కంటి ఆసుపత్రి మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరగనుంది. ఈ కార్యక్రమంలో కంటి సమస్యలతో బాధపడుతున్నవారు హాజరై ఉచితంగా వైద్య సేవలు, పరీక్షలు, అవసరమైతే శస్త్రచికిత్సలు పొందాలని నిర్వాహకులు కోరారు.