KNR: అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు చంపుతానని బెదిరించిన కేసులో నిందితునికి 3సం.ల జైలు శిక్ష పడింది. పెగడపల్లి మండలం దోమలకుంటకి చెందిన లక్ష్మికి, గంగాధర మండలం. చర్లపెల్లికి చెందిన శ్రీనివాస్‌కు వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం శ్రీనివాస్ 2016లో లక్ష్మీ, పిల్లలపై కిరోసిన్ పోసి చంపడానికి ప్రయత్నించాడు. దీంతో అతడిపై కేసు నమోదైంది. ఈరోజు కోర్టు తీర్పు వెలువరించింది.