ELR: ఈ రోజు తెల్లవారుజామున కర్నూలు సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో అనేక మంది ప్రయాణికులు మరణించారని తెలిసి ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు.