MBNR: టపాసులు పేలి నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. పాలమూరు రూరల్ రేగడిగడ్డ తాండ పంచాయతీ పరిధిలోని ప్రైమరి పాఠశాల విద్యార్థులు శుక్రవారం ఉదయం క్లాస్ బయట టపాసులు పేల్చారు. టపాసులు పేలడంతో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఆ సమయంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడంతో సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు.