BHPL: మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రాణాలకు ప్రమాదం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఘనపూర్ CI కరుణాకర్ రావు హెచ్చరించారు. గొర్లవీడు గ్రామానికి చెందిన భరత్ ఈనెల 5వ తేదీన మద్యం తాగి కారుతో బైకును ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న దంపతులు మరణించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శనివారం నిందితుడిని అరెస్ట్ చేశారు.