MBNR: ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా నిజమైన అర్హులను గుర్తించి ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో మహబూబ్ నగర్ రూరల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు బహుళ అంతస్తు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.