ప్రకాశం: కనిగిరి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం వైసీపీ కార్యాలయంలో జరుగుతుందని నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్ గురువారం తెలిపారు. ఉదయం 9 గంటలకు జరిగే సమావేశానికి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యల తరలిరావాలని ఆయన కోరారు.