SKLM: నరసన్నపేట మండలం లుకలాం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు బొత్స శ్రీరాములు ఏప్రిల్ 8న చెట్టు పైనుండి జారిపడి మృతి చెందారు. ఆయన నరసన్నపేట ఎస్బీఐలో డిఫెన్స్ శాలరీ పెన్షన్ అకౌంట్ కలిగి ఉండటంతో ప్రమాద బీమా వర్తించింది. ఈ నేపథ్యంలో రూ.50 లక్షల ప్రమాద బీమా మొత్తాన్ని మంగళవారం సాయంత్రం ఆయన భార్య సూరీడుకు బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ మధుసూదన రావు అందజేశారు.